సీక్రెట్ గా కత్రినా-విక్కీ నిశ్చితార్ధం.. త్వరలోనే పెళ్లి !

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో మరో జంట పెళ్లికి పిట్టలు ఎక్కేందుకు సిద్ధమైందని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ గాసిప్స్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ వ్యవహారం తెలిసే ఉంటుంది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని గత రెండు సంవత్సరాలుగా బాలీవుడ్ పరిశ్రమలో రచ్చ కొనసాగుతోంది. దాదాపు అందరూ బీ టౌన్ సెలెబ్స్ పాటించే ఆచారాన్ని ఈ క్రేజీ కపుల్ కూడా ఫాలో అవుతూ వచ్చారు.

అవునని చెప్పకుండా… కాదని ఖండించకుండా అన్ని రూమర్స్ వచ్చినా ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో అడపాదడపా ఫోటోలు బయటకు రావడం మరియు డిన్నర్ మీటింగ్స్ లో కలిసి కనిపించడంతో ఏదో వీరి మధ్య జరుగుతుందని ప్రచారం మాత్రం జోరుగా సాగేది… సాగుతోంది కూడా. అయితే ఇప్పుడు ఎట్టకేలకు క్యాట్ అండ్ విక్కీ కౌశల్… మూసుకో తీసేద్దాం అని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అది కూడా ఈ ఏడాదే పెళ్లి పీటలేక్కేందుకు కూడా సిద్ధం అవగా… ఇప్పటికే ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం కూడా పూర్తి చేసుకున్నట్లు…. సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.