యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌తో పాటు పలు రీజనల్ ఆఫీసుల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం. యూఐడీఏఐ ప్రధాన లక్ష్యం భారత పౌరులకు ఆధార్ కార్డులు జారీ చేయడం. దేశంలోని 6 ప్రాంతాల్లో ఉన్న రీజనల్ ఆఫీసుల్లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు చండీగఢ్, ఢిల్లీ, ముంబై, లక్నో, రాంచీలో యూఐడీఏఐ రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. ఈ ఆఫీసుల్లో ఉన్న ఖాళీల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. డిప్యూటీ డైరెక్టర్, సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రెటరీ లాంటి పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని రీజనల్ ఆఫీసులో 2 ప్రైవేట్ సెక్రెటరీ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలను యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ www.uidai.gov.in లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే వారు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో ఫామ్ డౌన్ లోడ్ చేయాలి. వేర్వేరు రీజనల్ ఆఫీసులకు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏ రీజనల్ ఆఫీసులోని పోస్టులకు దరఖాస్తు చేస్తే ఆ ఆఫీసుకి మాత్రమే దరఖాస్తులు పంపాలి.
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం ఖాళీలు 15 ఉండగా వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రైవేట్ సెక్రెటరీ– 7 , డిప్యూటీ డైరెక్టర్– 3 ,అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్– 2 , సెక్షన్ ఆఫీసర్– 3 .
దరఖాస్తుకు చివరి తేదీ– 2021 సెప్టెంబర్ 23
విద్యార్హతలు– వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
హైదరాబాద్‌లోని పోస్టులకు దరఖాస్తుల్ని పంపాల్సిన అడ్రస్:
Assistant Dircetor, General (HR),
Unique Identification Authority of India (UIDAI),
Regional Office, 6th Floor,
East Block, Swarna Jayanthi Complex,
Beside Maitrivanam,
Ameerpet, Hyderabad& 500038