కేసీఆర్‌ అడిగిన ప్రశ్నకు.. సుత్తి లేకుండా సమాధానం చెప్పు : నిర్మలమ్మకు కవిత ట్వీట్

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నలు సంధించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కెసిఆర్ గారి ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పండని ఛాలెంజ్‌ విసిరారు కల్వకుంట్ల కవిత. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు ? అని నిలదీశారు కవిత. దేశం కోసమా? దేశం అంటే మట్టి మాత్రమే కాదన్నారు. ఎల్ఐసీ అమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్తితి ఏమిటని నిలదీశారు ఎమ్మెల్సీ కవిత.

కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట పెట్టిన బడ్జెట్‌ పెద్ద బూటకమని నిప్పులు చెరిగారు. బీజేపీ వైఖరి సమాఖ్య స్పూర్తికి విరుద్దమని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సంస్థ అద్భుతమైన పురోగతితో,దేశంలోని ఇతర సంస్థల కంటే ఎంతో గొప్పగా లాభాలు సాధించిందన్నారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల్లో ఉన్నట్టుగా చూపిస్తూ,4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోందని.. సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఎం శ్రీ కేసీఆర్ గారు అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news