దుబ్బాక ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో గెలుపు క్లియర్ అయ్యిందన్న ఆయన భారీ మెజారిటీతో గెలుస్తామని అన్నారు. ప్రజల ముఖాల్లో చిరునవ్వే మనకు ముఖ్యమని ఆయన అన్నారు. ఇక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ధరణి పోర్టల్ గురించి అడుగుతున్నారని ఆయన అన్నారు. దుబ్బాక ఎన్నికలు మాకు పెద్ద లెక్కే కాదని ఆయన తేల్చేశారు.
ఇక రాబోయే 15 రోజుల్లో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ లు ప్రారంభం అవుతాయని ప్రతి ఓపెన్ ప్లాట్ దారుడు నాన్ అగ్రికల్చర్ ఆస్తిగా నమోదు చేసుకోవాలని అన్నారు. ప్లాట్ ల వివరాలు వెబ్ సైట్ లో కనిపించొద్దు అనుకుంటే హైడ్ ఆప్షన్ పెట్టుకోవచ్చని ఆయన అన్నారు. పూర్తి టైటిల్ విషయంలో ఓనర్ నష్టపోతే ప్రభుత్వమే నష్ట పరిహారం ఇస్తుందని అన్నారు. అలానే ధరణి పోర్టల్ బ్యాకప్ సర్వర్లని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.