ఇకనుంచి ఒంటిపూట కాలేజీలే..!

-

అన్లాక్ మార్గదర్శకాల లో భాగంగా ఆయా రాష్ట్రాలలో ఉన్న విద్యా సంస్థలను పునఃప్రారంభం చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థను ప్రారంభించేందుకు జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే పలుమార్లు విద్యాసంస్థలను పునః ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

నవంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు పునః ప్రారంభించేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. విద్యార్థులకు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఈ క్రమంలోనే విద్యార్థులకు ఒంటి పూట మాత్రమే విధులు నిర్వహించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంటర్ కాలేజీ ల ఈ విషయంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు జగన్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఒకరోజు సెకండియర్ మరో రోజు క్లాసులు నిర్వహించడంతో పాటు ఇంటర్ కాలేజీలు కూడా ఒంటిపూట నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందట.

Read more RELATED
Recommended to you

Latest news