ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియా ఎంపిక పై దుమారం…!

-

ఆస్ట్రేలియా పర్యటనకు భారత క్రికెట్‌ జట్ల ఎంపికపై దుమారం రేగుతోంది. సునీల్‌ జోషి సారథ్యంలోని సెలెక్షన్‌ కమిటీపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆటగాళ్ల ఎంపికకు పాటించిన ప్రమాణాలపై ఇప్పుడు పెద్ద రచ్చ నడుస్తోంది. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకడైన సూర్యకుమార్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించిందంటూ మాజీలు సెలక్షన్‌ కమిటీపై ఫైరవుతున్నారు. సూర్యకుమార్‌ యాదవ్‌ గత నాలుగేళ్ల నుంచి ఐపీఎల్‌లో నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. రంజీల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌ల్లో సూర్యకుమార్ ఒకడు. అలాంటి ప్లేయర్‌ను సెలక్షన్‌ కమిటీ ఎందుకు ఎంపిక చేయలేదని మాజీలు ప్రశ్నిస్తున్నారు.

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో వికెట్లు కోల్పోతున్నా..సహనం కోల్పోకుండా సూర్యకుమార్‌ చేసిన బ్యాటింగ్‌ అద్భుతం. సింగిల్‌ హ్యాండెడ్‌గా ముంబైను విజయ తీరాలకు చేర్చాడు సూర్య కుమార్‌. 43 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 362 పరుగులు చేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆస్ట్రేలియా టూర్‌కు ఇలాంటి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ ఎంపిక చేయడంపైనే అసలు చర్చ నడుస్తోంది. టీమిండియాకు ఎంపిక అవ్వాలంటే సూర్యకుమార్‌ ఇంకేం చేయాలో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. ఆసీస్‌ టూర్‌కు ఎంపికైన చాలా మంది ప్లేయర్స్‌ ఐపీఎల్‌లో రాణించిన వారే. అందుకే జట్టు ఎంపికకు ఏ ప్రమాణాలు పాటించారని సెలక్టర్లను మాజీలు ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news