కేంద్రానికి ఉమ్మడి షాక్ ఇచ్చిన కెసిఆర్, జగన్…!

-

దేశంలో ఎన్పిఆర్, సిఏఏ, ఎన్సిఆర్ విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మైనార్టీ లను దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రాజకీయంగా బిజెపి బలంగా ఉండి ఇలా విపక్షాలకు ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకు ని దెబ్బ తీయడానికి ఈ విధంగా వ్యూహాలు సిద్దం చేసింది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. వీటిని పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Jagan Mohan Reddy and KCR

తాజాగా మరో రెండు రాష్ట్రాలు ఎన్పిఆర్ విషయంలో కేంద్రానికి షాక్ ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అమలు చేసేది లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుని కేబినేట్ లో కూడా తీర్మానం చేసారు. ఇక అసెంబ్లీ లో కూడా బిల్లు ప్రవేశ పెట్టాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)ప్రక్రియను తెలంగాణలో చేపట్టలేమని,

తెలంగాణా సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైకి స్పష్టం చేశారు. ఎన్‌పీఆర్‌లో అభ్యంతరకర, అదనపు ప్రశ్నలు ఉన్నాయని, అందువల్ల దాన్ని అమలు చేయడం సాధ్యం కాదని ఆయన గవర్నర్ కి స్పష్టం చేసారు. నిన్న రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసిన ఆయన ఈ నిర్ణయం వెల్లడించారు. ఇక పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కూడా కెసిఆర్ ఇప్పటికే అమలు చేసేది లేదని స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news