వారికి పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్…!

-

కరోనా వైరస్ కట్టడిలో వైద్యులు చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుది. కరోనా వైరస్ కట్టడిలో వారి పాత్ర అనేది చాలా కీలకం. అలాగే పోలీసు శాఖ కూడా కరోన వైరస్ ని కట్టడి చేయడానికి చాలా కష్టపడుతుంది. వేలాది మంది పోలీసులు కుటుంబాలను వదిలి ఇప్పుడు రోడ్డు మీద బ్రతుకుతున్నారు. కరోనా వైరస్ వాళ్ళు లేకపోతే ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తెలంగాణాలో ఆర్ధిక పరిస్థితి నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్… ఇటీవల అన్ని వర్గాల ఉద్యోగులకు కూడా జీతాలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. భారీగా సగానికి పైగా జీతాల్లో కోత విధించారు. అయితే ఇప్పుడు ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు కనపడుతుంది. వేతనాల కోత నుంచి వైద్యాఆరోగ్య వాఖ, పోలీసులకు మినహాయింపు ఇస్తూ మార్చి నెలకు సంబంధించి,

వారికి పూర్తి జీతం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బుధవారం ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్షలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. సమీక్షలో వైద్యారోగ్య సిబ్బంది, పోలీసులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలంగాణా ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి…

Read more RELATED
Recommended to you

Latest news