అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఒక పక్క అమెరికా కరోనా వైరస్ తీవ్రతకు అల్లాడిపోతుంది. అయినా సరే ట్రంప్ మాత్రం అక్కడ లాక్ డౌన్ ని ప్రకటించడం లేదు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి అక్కడి ప్రజల నుంచి అన్ని రాష్ట్రాల గవర్నర్లు అధికారుల వరకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే ట్రంప్ లో మాత్రం ఆ సీరియస్ నెస్ కనపడటం లేదని అంటున్నారు.
లాక్ డౌన్ ప్రకటించాలని అక్కడి ప్రజలు కోరుతున్నా సరే ట్రంప్ మాత్ర౦ లాక్ డౌన్ ని ప్రకటించడానికి ముందుకి రావడం లేదు. నేను చేసిందే నేను చేసేస్తా అన్నట్టుగా ట్రంప్ వ్యవహరిస్తున్నారు. అమెరికాలో ఇప్పుడు కరోనా వైరస్ కేసుల సంఖ్య దాదాపు రెండు లక్షల వరకు ఉండగా నిన్న ఒక్క రోజే కరోనా వైరస్ బారిన పడి అక్కడ దాదాపుగా వెయ్యి మంది వరకు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది.
ఇక అక్కడ వృద్దుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. రోజు రోజుకి యువకులు కూడా అక్కడ కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు అక్కడ కరోనా కట్టడి కాకపోతే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతీ అమెరికన్ కూడా ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా బ్రతుకుతున్నాడు. మరి ఇది ఎప్పుడు అదుపులోకి వస్తుందో చూడాలి.