ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ అభ్యర్ధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖరారు చేసారు. ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్లను జగన్ ఖరారు చేసారు. ఇక ఇప్పుడు తెలంగాణా వంతు వచ్చింది. తెలంగాణా నుంచి ఎవరిని రాజ్యసభకు పంపిస్తారు అనేది ఆసక్తి నెలకొంది. గత 20 రోజులుగా అనేక పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. దాదాపు 10 పేర్లను కెసిఆర్ పరిశీలిస్తున్నారని అంటున్నారు.
అందులో ప్రధానంగా నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత, హెటిరో డ్రగ్స్ అధినేత పార్ధసారధి రెడ్డి తో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేకే పేర్లు ప్రస్తావనలో ఉన్నాయి. ఇక కొందరు సీనియర్ నేతలు కూడా రాజ్యసభకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కెసిఆర్ ఇప్పుడు రెండు పేర్లను ఖరారు చేసారని అంటున్నారు. కవిత, పార్ధసారధి రెడ్డి పేర్లను ఆయన దాదాపుగా ఖరారు చేసారని అంటున్నారు.
కవిత పార్లమెంట్ నుంచి ఓడిపోయిన తర్వాత కాస్త పార్టీ కార్యాకలాపలకు దూరంగా ఉంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇక బండి పార్ధ సారధి రెడ్డిని కూడా ఆయన రాజ్యసభ కు పంపించే యోచన లో ఉన్నారు. ఆయన వ్యాపార రంగంలో దిగ్గజం. ఆయన పార్లమెంట్ కి వెళ్తే బాగుంటుంది అనే భావనలో కూడా కెసిఆర్ ఉన్నారు. ఈ రెండు పేర్ల మీద రేపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై పార్టీ కీలక నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటన చేస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.