కరోనా వైరస్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు అలర్ట్‌ను ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మన దేశంలోనూ కరోనా వైరస్ పట్ల ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నాయి. అయితే దేశంలోని టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్‌లు ఇంకాస్త ముందుకు వెళ్లి తమ వినియోగదారులు ఇతరులకు కాల్ చేస్తే కరోనా కాలర్ ట్యూన్ వినిపించేలా ఏర్పాటు చేశాయి. అయితే దీనిపై వినియోగదారులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇతరులకు కాల్ చేసినప్పుడల్లా దగ్గుతున్న వ్యక్తి శబ్దం అనంతరం కరోనా వైరస్ జాగ్రత్తల మెసేజ్ వినాల్సి వస్తోందని, ఇది చిరాకు తెప్పిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ కాలర్ ట్యూన్ వినిపించకుండా ఉండేందుకు ఓ చిట్కా ఉంది. అదేమిటంటే…
మీకు కావాలనుకున్న వ్యక్తికి కాల్ చేసినప్పుడు కరోనా వైరస్ మెసేజ్ కాలర్ ట్యూన్ వినబడగానే కీ ప్యాడ్ ఓపెన్ చేసి నంబర్ 1ను ప్రెస్ చేయాలి. దీంతో కరోనా వార్నింగ్ మెసేజ్‌ను వినకుండా తప్పించుకోవచ్చు. అయితే ఇది ఒక్కోసారి పనిచేయదని తెలుస్తోంది. కానీ ఒకసారి ట్రై చేసి చూడండి.. ఆ కాలర్ ట్యూన్ మీకు విసుగు తెప్పిస్తుంటే.. ఈ చిట్కాను ఒక్కసారి పాటించి చూడండి. కుదిరితే ట్యూన్ వినకుండా తప్పించుకోవచ్చు కదా..!