బీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కి మరో కీలక పదవి ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ని హుజురాబాద్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జి గా నియమించారు. ఈ మేరకు బీ ఆర్ ఎస్ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది.
ఇక నుంచి ఎన్నికల వరకు హుజురాబాద్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జి గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కొనసాగనున్నారు. ఇక ఇప్పటికే.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి.. హుజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నట్లు ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే తాజాగా హుజురాబాద్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జి గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నియామకం అయ్యారు.