కుద‌ర‌ని హామీలు ఇస్తున్న కేసీఆర్‌.. త‌ల‌లు ప‌ట్టుకుంటున్న ఎమ్మెల్యేలు

-

కేసీఆర్ లాంటి అప‌ర చాణ‌క్యుడు ఏ ప‌ని చేసినా కూడా దాంట్లో ఎంతో ముంద‌స్తు వ్యూహం క‌చ్చితంగా ఉంటుంది. ఇక ఇప్పుడు తెలంగాణ‌లో అత్యంత కీల‌క‌మైన‌టు వంటి హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఆయ‌న చేస్తున్న వ్యూహాలు అంతా ఇంతా కావు.ఎలాగైనా ఈట‌ల రాజేంద‌ర్ మీద గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో పైకి చెప్ప‌క‌పోయినా కూడా భారీ ప్ర‌ణాళిక‌ల‌నే రూపొందిస్తున్నారు. ఇక ఇందులో భాగంగా అత్య‌ధికంగా ఉన్న ఎస్సీ ఓట్ల కోసం ఆయ‌న ద‌ళిత‌బంధు స్కీమ్‌న తీసుకొచ్చారు. ఇక దీన్ని తీసుకొచ్చాక కొత్త చిక్కులు మొద‌ల‌య్యాయి.

 

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

ఎందుకంటే ఈ ద‌ళిత బంధును తెర‌మీద‌కు తెచ్చిన‌ప్ప‌టి నుంచి అన్ని వ‌ర్గాల నుంచి ఒక‌టే డిమాండ్ వినిపిస్తోంది. మిగ‌తా సామాజిక వ‌ర్గాలు ఎలాగైనా స‌రే త‌మ‌కు కూడా అలాంటి స్కీమ్ ఒక‌టి పెట్టాలంటూ కోరుతున్నారు. జిల్లా్లో ఉండే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌పై ఈ డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది. దీంతో వారికి ఏం చేయాలో అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. కానీ కేసీఆర్ అయితే ఈ డిమాండ్ల‌ను పెద్ద‌గా సీరియ‌స్ గా తీసుకోవ‌ట్లేదు.

అయితే త‌న వ‌ద్ద ఉన్న భారీ అస్త్రాన్ని తీసి అంద‌ర‌కి ద‌ళిత బంధు లాంటి స్కీమ్ పెడుతామ‌ని హామీ ఇచ్చేశారు త‌మ పార్టీ మీటింగులో. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న‌టువంటి ల‌క్ష‌ల మంది ద‌ళిత కుటుంబాల‌కు ఇవ్వ‌డ‌మే పెద్ద స‌వాల్ అనుకుంటే ఇక కోట్లాదిగా ఉన్న బీసీ, ఎస్టీ వ‌ర్గాల‌కు ఎలా ఇస్తారంటూ అంద‌రూ షాక్ అవుతున్నారు. ఇలా కిని విష‌యాల‌ను గురించి బీసీ బంధు లాంటి స్కీమ్ లు పెడ‌తామ‌ని లేని ఆశ‌లు క‌ల్పించ‌డం పెద్ద త‌ప్పిద‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలు గ‌న‌క నెర‌వెర్చ‌క పోతే పార్టీకే న‌ష్టం జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news