ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కేసీఆర్ తీపి కబురు.. 30 శాతం జీతాలు పెంపు

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతాం కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. సమగ్ర శిక్షణ, కస్తూరిభా గాంధీ విద్యాలయాల్లో ఔట్ సోర్సింగ్  కాంట్రాక్టు ప్రాతి పదికన పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ ఉద్యోగులకు ఏకంగా 30 శాతం వేతనాలు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ పెరిగిన జీతాలను ఈ ఏడాది అంటే 2021 జూన్ మాసం నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటన చేసింది ప్రభుత్వం. ఇక ముందు కూడా.. చాలా సమర్థవంతంగా ఉద్యోగులు పని చేయాలని… పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వానికి… విన్నవించామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.  ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news