జర్నలిస్ట్ సాయిపై కేసీఆర్ ప్రభుత్వం సీరియస్..!

-

జర్నలిస్ట్ సాయిపై కేసీఆర్ ప్రభుత్వం సీరియస్ అయింది. నిన్న కేసీఆర్‌ ప్రారంభించిన మెడికల్‌ కాలేజీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫైర్‌ అయింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర నిధులతో ప్రారంభించిన 8 మెడికల్ కాలేజీల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉన్నట్టు జర్నలిస్ట్ సాయి చేసిన వీడియో అవాస్తవాలను ప్రచారం చేసే విధంగా ఉందని కేసీఆర్ ప్రభుత్వానికి చెందిన ఓ ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా సాయికి కౌంటర్‌ ఇచ్చింది.

ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసినపుడు, ఆ సంస్థలు అన్నిరూల్స్ & రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు అని ధృవీకరించుకొని అనుమతులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్ననేషనల్ మెడికల్ కమిషన్ (NMC) బాధ్యత. దేశంలోని వివిధ రాష్ట్రాలకు 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేటాయించలేదు.

అయినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం, ఇప్పటివరకు 12 మెడికల్ కాలేజీలు స్వంత నిధులతో ఏర్పాటు చేసింది. వీటికి కేంద్రప్రభుత్వం ఏలాంటి నిధులు మంజూరు చేయలేదని పేర్కొంది సర్కార్. తెలంగాణలో 8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేనప్పటికీ, కేవలం అనుమతులు మంజూరు చేయడాన్ని, కేంద్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్టు అర్థం వచ్చేలా తప్పుదోవ పట్టించే విధంగా వీడియోలు చేయవద్దని జర్నలిస్ట్ సాయి గారికి విజ్ఞప్తి చేస్తున్నామని మర్యాదగా చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news