తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే అన్ని శాఖల్లో నుంచి ఖాళీల వివరాలను తీసుకుని.. ఏ క్షణమైన నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. కాగ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు జారీ చేసే ముందు ఏజ్ లిమిట్ గురించి స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఉద్యోగాల భర్తీ కోసం ఏజ్ లిమిట్ ను పెంచాతమని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటన చేశారు.
కాగ ఏజ్ లిమిట్ సడలింపులపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే కొద్ద రోజుల్లోనే నిరుద్యోగులకు ఏజ్ లిమిట్ విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఏజ్ లిమిట్ సడలింపుల కోసం ఇప్పటికే అధికారులు పలు ప్రతిపాదనలను సిద్ధం చేశారని సమాచారం. ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపినట్టు తెలుస్తుంది.
కాగ ఈ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేస్తే.. ఏజ్ లిమిట్ పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగ ప్రస్తుతం ఏజ్ లిమిట్ ఓసీ లకు 34 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు 39 ఏళ్లు ఉంది. అలాగే దివ్యాంగులకు 44 ఏళ్ల ఏజ్ లిమిట్ ఉంది.