కొనుగోలుదారుల‌కు ఊర‌ట‌.. స్థిరంగా బంగారం, వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి కొనుగోలు దారుల‌కు కాస్త ఊర‌ట ల‌భించింది. వ‌రుస‌గా మూడు రోజుల పాటు త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర నిన్న పెరిగాయి. కాగ నేడు నిల‌క‌డ‌గా ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర మాత్రం రూ. 10 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌రలో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,450 గా ఉంది.

అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,770 గా ఉంది కాగ బంగారం ధ‌ర‌లు నేడు స్థిరంగా ఉండ‌టం కొనుగోలు దారుల‌కు కాస్త ఊర‌ట క‌లిగించే అంశం అని చెప్ప‌వ‌చ్చు. కాగ ఉక్రేయిన్ – ర‌ష్యా యుద్ధం కార‌ణంగా బంగారం ధ‌ర భారీగా పెరుగుతుంది. ఇప్ప‌టికే రూ. 52 వేల మార్క్ ను అందుకున్న బంగారం.. ప్ర‌స్తుతం రూ. 51 వేల వ‌ద్ద ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో వెండి ధ‌ర‌ల్లో కూడా నేడు ఎలాంటి మార్పులు లేవు. నిన్న ఒక్క రోజే రూ. 600 పెరిగిన వెండి ధ‌ర‌లు నేడు స్థిరంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news