నర్సంపేట: ఎవ్వరిని వదిలిపెట్టం…కేసీఆర్

-

తెలంగాణ ప్రజలు వివేకవంతులు.. మరోసారి ఆశీర్వదిస్తే నాటి ప్రభుత్వాల్లో జరిగిన అవినీతిని ఎండగడతానని కేసీఆర్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన తెరాస ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా చిల్లర రాజకీయాలు ఇంకా పోలేదు.. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఆ చంద్రబాబు శని ఇంకా మనకు వదలలేదు.  గత ప్రభుత్వాలు ఇవ్వని ఎన్నో పెన్షన్లను తెరాస అందించింది. దేశంలో 24 గంటల పాటు కరెంటు ఇచ్చిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇక్కడ ఢిల్లీ బాస్ లు ఎవ్వరూ లేరు. మహాకూటమి అంటూ కొంత మంది అమరావతికి గులాం గిరి చేస్తా అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చేసిన అవినీతిని త్వరలోనే బయటపెడతామన్నారు.  నర్సంపేట ప్రజలను చంద్రబాబు మనకు అవసరమా…అని కేసీఆర్ అడగ్గా …వారి నుంచి మనకొద్దు…అంటూ నినాదాలు రావడాన్ని ఆయన స్వాగతించారు .ఈ సందర్భంగా మీడియా మిత్రులకు కాస్త ..ఆ నర్సంపేట ప్రజలను చంద్రబాబుకి చూపించండి.

కత్తి చంద్రబాబు దగ్గర ఉంది…తెలంగాణను ఇంకా వదల పెట్టడం లేదు.  కాస్త ఆలోచించి మీరు ఓటు ద్వారా అలాంటి వారికి బుద్ధిచెప్పాలని కోరారు. సిటీ కాలేజీలో నాడు 7 విద్యార్థులను కాల్చిచంపిన ఘటన నాటి ప్రభుత్వం లో జరిగింది. ఇంత జరిగినా ఇప్పటికీ అదే పాట పడుతోంది. చిట్ట చివరి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయ ఇవ్వనంటుంటే అప్పటి కాంగ్రెస్ మిత్రులు పళ్లు ఇకిలిచ్చిర్రు. ఇక వలస పాలకులకు మీరు ఓటు ద్వారా బుద్ది చెప్పాలని కోరుకున్నారు. గిరిజనులకు ఇచ్చిన మాటను కాస్త లేటైనా సరే నిలబెట్టుకుంటాం. ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడిన ప్రభుత్వాన్ని మరో సారి ఆశీర్వదించండి అంటూ ప్రజలను కోరారు.

తెలంగాణ బొబ్చిలి సుదర్శన్ రెడ్డి ని ఈ సారి ఆశీర్వదించండి. మీ పక్షాన నిలబడే నాయకుడిని గెలిపించండి. కొంత మంది గుండా గిరి చేయాలని చూస్తున్నారు అలాంటి వారికి చెక్ పెట్టమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news