కరోనా వ్యాప్తిలో అందరికంటే ముందుగా సూపర్ స్ప్రైడర్లు ఉంటున్నారు. వీళ్లుఎవరో కాదు ఏదోఒక పనిమీద బయటకు వెళ్లేవారు. కాబట్టి వీరికి ముందుగా వ్యాక్సిన్ వేస్తే కరోనాను చాలా వరకు కట్టడి చేయొచ్చని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మే 28నుంచి ఈ సూపర్ స్ప్రైడర్లకు వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో దాదాపు 3లక్షల వరకు ఈ సూపర్ స్ప్రైడర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో ఆటో, క్యాబ్, ఇతర వెహికిల్స్ డ్రైవర్లు, రైతు బజార్లలో అమ్మకం దారులు, రేషన్ డీలర్లు, దుకాణా దారులు, డెలివరీ బాయ్స్, పెట్రోల్ పంపుల్లో పనిచేసేవారు ఉన్నారు.
వీరితో పాటు ప్రతి ఇంటిలో అవసరాల కోసం బయటకు వెళ్లే వారిని కూడా వ్యాక్సిన్ వేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కోసం 18 నుంచి 40ఏళ్ల సూపర్ స్ప్రైడర్లకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు 4.90లక్షల వ్యాక్సిన్లను సిద్ధం చేస్తున్నారు ఆఫీసర్లు. ముందుగా జీహెచ్ ఎంసీ పరిధిలోని వారికి వేస్తామని అధికారులు తెలిపారు.