పరమపవిత్రం వైశాఖ పౌర్ణమి!

-

బుద్ధపౌర్ణమి దీనికి మరో పేరు బుద్ధ జయంతి. ఇది చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజు బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడు పుట్టినరోజు. సాధారణంగా బుద్ధ పౌర్ణమి ఏప్రిల్, మే మధ్యలో వైశాఖ మాసంలో సిద్ధార్థ గౌతమ బుద్ధుడి జయంత్యోత్సవం నిర్వహిస్తారు. సంపూర్ణ పౌర్ణమి రోజు బుద్ధపౌర్ణమిని నిర్వహిస్తారు. మన భారత్‌లో గెజిటెడ్‌ హాలిడే. ఈ ఏడాది రేపు అంటే బుధవారం మే 26 తేదీన బుద్ధపౌర్ణమిని నిర్వహిస్తున్నారు.


బుద్ధుడిని ఆరాధించేవారు ఈరోజు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. మాంసాహారాన్ని కూడా ముట్టరు. ఆ రోజు ప్రత్యేకంగా ఖీర్‌ వండుతారు. బోధి వృక్షానికి అభిషేకం చేసి, నమస్కారం చేసి అక్కడ కాసేపు మెడిటేషన్‌ చేస్తారు. ఈ రోజు బిహార్‌లోని బోధిగయాలో ఉన్న బోధి టెంపుల్‌ను చాలా మంది సందర్శిస్తారు. ఇది వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా యునెస్కో గుర్తించింది. ఈ బోధి టెంపుల్‌లోనే బుద్ధుడు జ్ఞానం పొందాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించినవారు శాంతి, అహింసా మార్గాంలో వెళ్తారు. బౌద్ధపౌర్ణమి రోజు స్వచ్ఛమైన మనసుతో బుద్ధుడిని ప్రార్థిస్తారు. ముఖ్యంగా ఈరోజు ఆధ్యాత్నిక సాధనలు చేసినా అధిక ఫలితం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతుంది. బుద్ధుడి జీవితంలో ఈ వైశాఖ పౌర్ణమి మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యత వహించింది. శుద్ధోధనుడు, మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి రోజు సిద్ధార్ధుడు జన్మిస్తాడు. మరో వైశాఖ పౌర్ణమి నాడు జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారతాడు. ఇంకో వైశాఖ పౌర్ణమి రోజు నిర్యాణం చెందుతాడు. బోధి వృక్షాన్ని పూజ చేసే ఆచారం కూడా ఈ మహనీయుని జీవితకాలంలోనే ప్రారంభమైంది. ఆనాటి నుంచే బోధివృక్ష పూజ బౌద్ధులకు ప్రత్యేకమైంది. బోధి వృక్షానికి జెండాలను కట్టి, పరిమళ జలాన్ని పోస్తారు. హీనాయాన బౌద్ధ మతాన్ని అవలంభించే విధానం బర్మాలో ఈ ఉత్సవం నేటికీ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news