కరోనా సమయంలో జనాలకు మానవత్వం లేదు. ఎలా వ్యవహరిస్తున్నారు ఏంటీ అనేది కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. అంత్యక్రియలకు బంధువులు ఎవరూ రాకపోతే ఎమ్మార్వో వచ్చి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన ఇది. కర్నూలు జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గడివేముల తహశీల్ధార్ నాగమణి మానవత్వం చాటారు.
కరోనతో మృతిచెందిన మహిళకు అంత్యక్రియలు చేసారు తహశీల్ధార్ నాగమణి. గడివేముల మండలం కొరటమద్ది లో కరోన సోకి మృతి చెందిన లక్ష్మీదేవి(85) కుటుంబంలో కరోన సోకి క్వారంటైన్ లో మరో నలుగురు ఉన్నారు. లక్ష్మీదేవి అంత్యక్రియలు చేసేందుకు బంధువులు, గ్రామస్థులు ముందుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న తహశీల్ధార్ నాగమణి పసుపు, కుంకుమ చల్లి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేసారు.