ఇటీవల కాలంలో దేశాన్ని ఒక కుదుకుదిపేసిన గ్యాంగ్స్టర్ ఎవరైనా ఉన్నారంటే… అది ఉత్తరప్రదేశ్ కు చెందిన అతీక్ అహమ్మద్ అని చెప్పాలి. ఎన్నో చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసిన అతీక్ ను యూపీ పోలీసులు ఈనెల 15వ తేదీన ఎన్కౌంటర్ లో లేపేశారు. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ అతీక్ అహ్మద్ పేరును తెరపైకి తీసుకువచ్చాడు. తెలంగాణ తో పటు దేశమంతా కూడా అతీక్ అహ్మద్ చాలా ప్రమాదం అని భావిస్తున్నారు. కానీ మీకు అందరికీ తెలియని వాస్తవం ఏమిటంటే… అతీక్ అహమ్మద్ కన్నా సీఎం కేసీఆర్ చాలా ప్రమాదకరమని కామెంట్ చేశాడు. ఇటువంటి ఎంతోమంది గ్యాంగ్స్టర్ లకు గ్యాంగ్స్టర్ మన కేసీఆర్ అంటూ ఆయనపై సెటైరికల్ కామెంట్స్ చేశాడు.
అతిక్ గన్ లతో బెదిరిస్తే మన కేసీఆర్ మాత్రం పోలీసులతో బెదిరించి భయపెడుతారు. ఇప్పటి వరకు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, భూకుంభకోణం, డ్రగ్స్ కేసులు మరియు tspsc పేపర్ లీక్ లాంటి ఎన్నో విషయాలపైనా ఇంకా స్పష్టత రాలేదు. కేసీఆర్ ఏర్పాటు చేయించి రిపోర్టులు తయారు చేయించిన సిట్ పై మాకు నమ్మకం లేదు, సిట్టింగ్ జడ్జి చేత tspsc పేపర్ లీక్ పై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.