అండగా మేం ఉన్నాం.. రైతులు మనోధైర్యంతో ఉండాలి: హరీశ్‌రావు

-

రాష్ట్రంలో వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. లక్షల ఎకరాల్లో వరి పైరు నేలవాలింది. కల్లాల్లోకి చేరిన పంటంతా నీటిపాలైంది. మామిడి, నిమ్మ వంటి పంటలు రాలిపోయి రైతులు నష్టాల పాలయ్యారు. కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యమంతా నిన్న కురిసిన వానకు తడిసి ముద్దయింది. చాలా చోట్ల ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. రాష్ట్రంలో జరిగిన పంట నష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శించి భరోసా కల్పించాలని సూచించారు.

సిద్దిపేట జిల్లా రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పర్యటించారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. పంట పొలాలను పరిశీలించారు. ‘వడగళ్ల వానతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. త్వరగా పంటనష్టం అంచనాలు వేయాలని అధికారులకు చెప్పాం. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ రైతులను ఆదుకుంటాం. సిద్దిపేట జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. తినేముద్ద జారిపడినట్లుగా రైతుల పరిస్థితి తయారైంది. కౌలు రైతుల పరిస్థితి మరీ దీనంగా ఉంది. రైతులు మనోధైర్యంతో ఉండాలి, ప్రభుత్వం ఆదుకుంటుంది.’ అని హరీశ్‌రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news