రాజకీయాల్లో ఒక పార్టీ మనుగడ సాధించాలంటే దానికి కచ్చితంగా యూత్ ఆధరణ ఉండాల్సిందే. ఎందుకంటే ఒక్క యూత్ మాత్రమే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది. అందుకే మొదటి నుంచి అన్ని పార్టీలూ యూత్‌ను ఆకర్షించేందుకు ట్రై చేస్తాయి. ఆ తర్వాతే పెద్ద వయస్కుల వారిని టార్గెట్ చేస్తాయి. ఎందుకంటే పార్టీ ఏ పిలుపు ఇచ్చినా అది విజయవంతం కావాలంటే యూత్ ప్రమేయమే కీలకం. అందుకే యూత్ ను అన్ని పార్టీలూ అంతలా కొలుస్తాయి.
అయితే ఉద్యమ కాలంలో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న కేసీఆర్ ఆ తర్వాత ఎందుకో దూరంగా పెడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే యూత్ ఆలోచనలు ఎప్పుడూ ఒకలా ఉండవని వారు ఏ క్షణంలో ఎవరికి సపోర్టు చేస్తారో తెలియదని, ఎక్కువగా ఎమోషన్‌కు లోనయ్యి ఎటువైపైనా మళ్లుతారనే కారణంతో కేసీఆర్ వారిని పక్కన పెడుతూ ఇతర ఏజ్ గ్రూపుల వారే టార్గెట్ గా పెట్టుకున్నారుంట.
ఈ కారణాలతోనే యూత్‌కు ఉద్యోగాల అంశం కూడా పక్కన పెడుతూ కేవలం పెద్ద వాళ్లకు ఆసరాగా పింఛన్లు, రైతులకు అండగా రైతుబంధు లాంటి పథకాలు పెడుతూ వారిని ఆకట్టుకుంటున్నారు. వారయితే ఇలాంటి పథకాలను మరిచిపోకుండా గంపగుత్తగా టీఆర్ ఎస్‌కు ఓట్లు వేస్తారని గులాబీ బాస్ భావిస్తున్నారంట. అందుకే కేవలం పెద్ద వయస్కుల వారి ఓట్లను మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని అలాగే స్కీములు పెడుతున్నారు కేసీఆర్. అయితే ఇది రాబోయే కాలంలో ఆ పార్టీకి పెద్ద దెబ్బే అని విశ్లేషకులు చెబుతున్నారు.