కరోనా వైరస్ కట్టడి విషయంలో తెలంగాణా సిఎం కేసీఆర్ ఏ స్థాయిలో సీరియస్ గా ఉన్నారు అనేది ఆయన వరుసగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల ఆధారంగా చెప్పవచ్చు. ప్రతీ రోజు కూడా ఆయన అధికారులతో అర్ధరాత్రి వరకు సమావేశం అవుతున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులను క్షేత్ర స్థాయిలో పర్యటనలు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు కేసీఆర్. దీనితో అధికారులు గ్రౌండ్ లెవెల్ లో తిరుగుతున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ పర్యటనలలో కొన్ని సంచలన విషయాలు కేసీఆర్ కి తెలిసినట్టు సమాచారం. కొంత మంది అధికారులు లాక్ డౌన్ ని సీరియస్ గా తీసుకోవడం లేదని కేసీఆర్ కి సమాచారం అందింది. పోలీసు అధికారులు కూడా… లాక్ డౌన్ ని సీరియస్ గా తీసుకోకుండా అనుమతులు ఇస్తున్నారని, ఫ్రీ పాస్ లు ఇస్తున్నారని ఆయనకు సమాచారం రావడం తో కేసీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చారు.
వారిని సస్పెండ్ చెయ్యడమా లేక విధుల్లోకి రాకుండా పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టడమా లేక కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడమా అనే దాని మీద దృష్టి పెట్టి వారిని విధుల నుంచి తప్పించాలని, అవసరం అనుకుంటే జరిమానా కూడా విధించాలని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే సూర్యాపేట, మెదక్ జిల్లాల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులను ప్రభుత్వం తప్పించింది.