ఎన్టీఆర్ ని పూర్తిగా మార్చేస్తున్న త్రివిక్రమ్…!

-

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సినిమా షూటింగ్ లో మిగిలిన 20 శాతం షూటింగ్ ని పూర్తి చేయనుంది చిత్ర యూనిట్.

ఈ లోపు ఈ సినిమా ఎడిటింగ్, డబ్బింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి త్రివిక్రమ్ గట్టిగా వర్కౌట్ చేస్తున్నాడు. సినిమాలో ఎన్టీఆర్ ని వ్యాపారవేత్తగా చూపించే అవకాసం ఉందని అంటున్నారు. వ్యాపారం తో పాటుగా రాజకీయాల్లో కూడా అతను కనపడతాడు అని సమాచారం.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరిగి ఉంటే వచ్చే నెల తో ఎన్టీఆర్ పార్ట్ షూటింగ్ పూర్తి అయి ఉండేది. ఈ సినిమా షూటింగ్ అవ్వగానే… త్రివిక్రమ్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే కథను పూర్తిగా సిద్దం చేసాడు త్రివిక్రమ్. హీరోయిన్ గా పూజ హెగ్డే ని తీసుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news