రేపు హుజురాబాద్‌ ఉప ఎన్నికపై కేసీఆర్‌ కీలక సమీక్ష..!

-

హుజురాబాద్‌ ఉప ఎన్నిక సమీక్షిస్తున్న నేపథ్యం లో పార్టీ పై దృష్టి సారించారు తెలంగాణ ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు. ఇప్పటికే వరుస భేటీలతో పాలనను కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్‌…. మంగళవారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చించనున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, అందుకోసం తేదీల ఖరారు తదితర అంశాల పై సమావేశం లో చర్చిస్తారు. ముఖ్యంగా హుజురాబాద్‌ నియోజక వర్గం ఉప ఎన్నిక పై ప్రత్యేకంగా చర్చించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే…. దళిత బంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అను సరించాల్సిన పద్దతి, తీసుకోవాల్సిన చర్యల గురించి, పార్టీ చేయాల్సిన కృషి పై చర్చించ నున్నారు.  కాగా.. ఈటల రాజేందర్‌ రాజీనామా తో హుజురాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news