ఈ మధ్య కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్ ( Electric vehicle ) ని కొనుగోలు చెయ్యడానికి మక్కువ చూపిస్తున్నారు. మామూలుగా ఇంధన వాహనాల వల్ల ఎంతో కాలుష్యం అవుతోంది. ఈ కారణంగా కొందరు వీటికి దూరంగా ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని అనుకుంటారు. మీరు కూడా ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు ఈ విషయాలని తెలుసుకోవాలి.
ఎలక్ట్రిక్ వెహికిల్ | Electric vehicleఎలక్ట్రిక్ వాహనాల వలన కాలుష్యాన్ని తగ్గించచ్చు. అలానే ఈ వాహనాలను అప్‌గ్రేడ్ చేసుకొనే అవకాశం కూడా ఉంది. అలానే ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల తో తక్కువ ధరకు ఇది మనకి లభిస్తుంది.
పైగా వినియోగించడం చాలా సులభం. ఎలక్ట్రిక్ వాహనంలో ఇంజన్ ఆయిల్ మార్చే పని ఉండదు. నిజానికి ఈ వాహనాల్లో ఇంజన్ ఉండదు. సాధారణ వాహనాల్లో వాడే బెల్ట్, చైన్ వాల్వ్, క్లచ్‌లు ఇవేం ఉండవ్ కావున నిర్వహణ సులభం అవుతుంది.
ఎలక్ట్రానిక్ వాహనాలకు ప్రస్తుతం వినియోగిస్తున్న వాహనాలలాగా తరచూ సర్వీసింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సాంకేతికంగా ఎలక్ట్రిక్ వాహనాలు మెరుగ్గా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న వాహనాల కంటే చాలా తక్కువ ఖర్చుతో సర్వీసింగ్ పూర్తవుతుంది. ఎలక్ట్రిక్ వెహికిల్ కార్లు సాధారణ కార్లలాగే బరువును మోయగలుగుతాయి. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.
ఒకవేళ కనుక ఈ వెహికిల్స్ కి ఏమైనా సమస్య ఉంటే కూడా పెద్ద కష్టం ఉండదు. ఎలక్ట్రిక్ వాహనం లో ముందు ఒక ఇంజన్, వెనుక ఒక ఇంజన్ ఉంటుంది. ఏదైనా ఒక దాంట్లో సమస్య వస్తే ఇంకో ఇంజన్‌తో బండిని నడపవచ్చు. రెండు పాడైతేనే కారును తీసుకెళ్లడానికి రోలింగ్ అవసరం అవుతుంది.