కెసిఆర్ ముందు జాగ్రత్తలు పడుతున్నారా…?

-

కరోనా ప్రభావం ఏమో గాని ప్రపంచ దేశాల్లో రైతులు అందరూ భారీగా నష్టపోతున్నారు. చైనాలో కరోనా ఉంటే గుంటూరు మిర్చి రైతులు ఇబ్బంది పడ్డారు. ఇండోనేషియాలో కరోనా ఉంటే మన తెలంగాణా కూడా ఇబ్బంది పడింది. మన దేశం నుంచి ఎన్నో ఆహార ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు చాలా చోట్ల పంటల దిగుబడి అనేది భారీగా తగ్గిపోయింది. అనేక ప్రాంతాల్లో పంటలు వేయడం లేదు.

ఈ సీజన్ లో పండిన పంటలను కూడా ఇప్పుడు మార్కెట్ కి తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితి దాదాపుగా లేదు అనేది వాస్తవం. ఈ నేపధ్యంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా జాగ్రత్తలు పడుతున్నారు. పంటలు ఎక్కడా పండటం లేదు, ఉన్న పంటలను అమ్ముకునే పరిస్థితి లేదు. దీనితో కేసీఆర్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. తెలంగాణాలో నిమ్మకాయ కాచినా సరే అది ఇక్కడి వాళ్ళే వాడుకోవాలి.

ప్రతీ వడ్డు గింజ అయినా సరే ఇక్కడి వాళ్ళే తినాలి గాని దాన్ని ఇతర రాష్ట్రాలకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎగుమతి చేయవద్దు. ఏ రాష్ట్రం అయినా సరే ఇప్పుడు బియ్యం, మొక్క జొన్న సహా ఇతర పంటలు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అందుకే ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తే మాత్రం కచ్చితంగా ఇబ్బంది పడటం ఖాయమని కెసిఆర్ భావిస్తున్నారు. అందుకే ఇక్కడి నుంచి ఏ ఒక్కటి ఎగుమతి చేయవద్దని,

ప్రభుత్వమే కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుంది అని కెసిఆర్ స్పష్టంగా చెప్పారు. భవిష్యత్తుని ఎప్పుడూ ఊహించే కేసీఆర్… ఈ విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించారు. ఏ విధంగా కూడా ఇక్కడి వాళ్ళను పస్తులు ఉండనిచ్చే అవకాశం లేదని, అందరికి అన్నం పెడతామని స్పష్టంగా చెప్తున్నారు ఆయన. వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో ఆయన ముందు చూపుని ఇప్పుడు అందరూ కొనియాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news