కరోనా వైరస్ తీవ్రత నేపధ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పేదలను ఆదుకోవడానికి సిద్దమైంది. నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి గానూ రూ.1,70,000 కోట్లతో ‘పీఎం గరీబ్ కళ్యాణ్’ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేరుగా వారి అకౌంట్‌లోకి నగదు బదిలీ చేసి ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇక్కడ నగదు బదిలీ విషయంలో కొన్ని ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వానికి ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
జన్ ధన్ అకౌంట్లలో చాలా వరకు పని చేయడం లేదు. ఎకౌంటు ఓపెన్ చేసినా గాని అవి ఎక్కువగా వాడటం లేదు. దీంతో నగదు బదిలీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాయి బ్యాంకులు. కేవైసీ వివరాలన్నీ సరిగ్గా ఉండి, డబ్బులు జమ చేస్తూ ఉండకపోతే ఆ అకౌంట్లను మళ్ళీ రీయాక్టివేట్ చేయాలని పలు బ్యాంకులు భావిస్తున్నాయి. దీనితో నగదు జమ అనేది సులువు అవుతుంది.
జన్ ధన్ యోజన వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం చూస్తే… 38.28 కోట్ల అకౌంట్లు ఉండగా వాటిలో రూ.1,18,105.97 కోట్ల నగదు ఉంది. జనవరి 15 నాటికి వీటిలో 19 శాతం ఇనాపరేటీవ్ గా ఉన్నాయి. జన్ ధన్ అకౌంట్లు ఉన్న 20 కోట్ల మహిళలకు నెలకు రూ.500 మూడు నెలల వరకు జమ కానుంది. వీరికే కాదు పీఎం కిసాన్ పథకంలో భాగంగా రైతులకు, ఉపాధి హామీ కూలీలకు కూడా డబ్బులు అందుతాయి.