అనాధ పిల్లలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త

అనాధ పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు  చెప్పింది. అనాధల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం బలమైన పునాది వేస్తుంది. పిల్లలను అక్కున చేర్చుకుని వారికి అన్నీ తానే అవుతోంది. విద్యాబుద్ధులు నేర్పించి.. తమ కాళ్ళపై తాము నిలబడేలా వ్యవహరిస్తోంది సర్కార్. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 బాలల సంరక్షణ కేంద్రాల్లోని అనాధ పిల్లలకు అన్ని రంగాలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తోంది.

KCR-TRS
KCR-TRS

విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీయడం కోసం నెలకు రెండు రోజులు వేదిక్ మ్యాథ్స్, అడ్వాన్స్ ఇంగ్లీష్, యోగ వ్యక్తిత్వ వికాసం, వ్యాస రచన, డ్రాయింగ్, కలలు, సంస్కృతులపై అవగాహన కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన ఈ ప్రత్యేక కార్యాచరణ రంగారెడ్డి జిల్లా తో ప్రారంభం అయింది.

అలాగే త్వరలోనే అన్ని జిల్లాలకు విస్తరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాలకు త్వరలోనే విస్తరించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పిల్లలకు ఆపద వస్తే అత్యవసర వినియోగానికి జిల్లాకో వాహనాన్ని కేటాయించింది. రాష్ట్రంలోని అన్ని శిశు విహార్, బాల సంరక్షక కేంద్రంలోని పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.