అక్కడ నుంచి వచ్చే వారు క్వారంటైన్ లో ఉండాల్సిందే..- హరీష్ రావు.

-

ఓమిక్రాన్ ముప్పు మంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంది. తాజాగా వైద్యారోగ్య శాఖ పై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్ తో పాటు, ఓమిక్రాన్ పై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ముఖ్యంగా థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వ్యాక్సిన్ వేగవంతంపై అధికారులతో చర్చించారు. కాగా ఇండియాలో ఇప్పటి వరకు ఎలాంటి కరోనా ఓమిక్రాన్ వైరస్ కేసులు నమోదు కాలేదు. అయినా ముందస్తు జాగ్రత్తగా తెలంగాణ పలు కీలక నిర్ణయాలకు సిద్దమైంది.

ఈరోజు వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశమైన ఆరోెగ్య శాఖ మంత్రి హరీష్ రావు పలు కీలక విషయాలను వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ ల వద్ద కరోనా టెస్టులు చేస్తున్నామని హరీష్ రావు అన్నారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, బోెట్స్ వానా, హాంకాంగ్ తో పాటు ఓమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్ లో తప్పకుండా ఉండాల్సిందే అని హరీష్ రావు స్పష్టం చేశారు. కరోనా కట్టడికి రెండు డోసుల వ్యాక్సిన్ తప్పినిసరి అని ఆయన అన్నారు. రెండో డోసు కోసం ప్రజలు ముందుకు రావడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news