రంగంలోకి సీఎం కేసీఆర్‌.. అర్ధరాత్రి ఉన్న‌తాధికారుల‌తో సమీక్ష

-

తెలంగాణ‌లో వాన‌లు దంచికొడుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్ మ‌హా నగ‌రంలో జ‌న జీవ‌నం స్తంభించింది. ఈ నేపథ్యంలో ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హుటాహుటిన రంగంలోకి దిగారు. రాజధాని హైదరాబాద్‌లో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా వర్షపాతం నమోదైనట్టు తెలుసుకొన్న ఆయన అర్ధరాత్రి వరకు వర్షాల పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను అప్రమత్తంచేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్నివిధాలా సన్నద్ధంచేసి తక్షణం సహాయచర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అప్పటికప్పుడే అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్షాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. మరోవైపు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డితోనూ సీఎం మాట్లాడారు. ముంపు, లోతట్టు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. సీఎం ఆదేశానుసారం డీజీపీ.. అన్ని జిల్లాల ఎస్పీలతో మాట్లాడారు. ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయకార్యక్రమాలపై తక్షణ చర్యలకు ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితస్థానాలకు తరలించాలని నిర్దేశించారు. అంతేగాక రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితిపై విద్యుత్‌ సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతోనూ సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news