ఢిల్లీలో టీఆర్ఎస్ భవనం.. శంకుస్థాపన చేయనున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో సమీపంలో టీఆర్ఎస్ భవననికి శంకుస్థాపన చేయనున్నారు. మద్యాహ్నం 1:48 గంటలకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. వాస్తు బద్దంగా, వేదపండితుల నడుమ, మంత్రాల సాక్షిగా, శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించనున్నారు. 1315గజాల స్థలంలో జరుగుతున్న ఈ నిర్మాణం, 5అంతస్తులుగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.

స్థల సంప్రోక్షణ, స్థల దిగ్భంధన మొదలగు కార్యక్రమాలతో పాటు గణపతి పూజ నిర్వహించనున్నారు. అనంతరం భూమి ఈశాన్య భాగంలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సుమారు 500మంది నేతలు పాల్గొంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సుమారు 500మంది నేతలు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేసీఆర్ సహా హాజరయ్యే ప్రజా ప్రతినిధులందరూ ఢిల్లీ పయనయ్యారు. శంకుస్థాపన అనంతరం మీడియాతో కేసీఆర్ సంభాషించనున్నారు.