ఆ నిధులపై కేసీఆర్ కీలక నిర్ణయం… శభాష్ అంటున్న వైద్యులు…!

-

కరోనాపై పోరాటంలో భాగంగా తెలంగాణా సర్కార్ భారీగా విరాళాలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణాలో ఉన్న ప్రముఖ వ్యాపరవేత్తఃలు, సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ముందుకి వచ్చి విరాళాలు అందించారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. వందల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఇప్పుడు ఈ నిధులు అన్నీ కూడా ఎం చెయ్యాలి అనే దానిపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

భవిష్యత్తులో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ నిధులు అన్నీ కూడా వైద్య సిబ్బందికి వినియోగించే ఆలోచన చేస్తున్నారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరిధించే విషయంలో, వ్యాధి సోకిన వారికి వైద్యం అందించే విషయంలో వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది గొప్ప సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. వారి భద్రతలకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిచిందని చెప్పుకొచ్చారు.

వారి ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టిందన్న కేసీఆర్… ప్రస్తుతం పరీక్షలకు, వైద్యానికి వస్తున్న వారికి సరిపడినంతగా టెస్ట్ కిట్స్, పీపీఈ=లు, మాస్కులు, ఇతర మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో పేషంట్ల సంఖ్య పెరిగినా, అందుకు అనుగుణంగా మాస్కులు, పిపిఐలు సేకరిస్తామని స్పష్టం చేసారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. సీఎంఆర్ఎఫ్ కు వస్తున్న విరాళాలను కూడా వైద్య సిబ్బందికి అవసరమైన మాస్కులు, పీపీఈలు, మందుల కొనుగోలుకు వాడాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news