రేపు సీఎం వరంగల్ జిల్లా టూర్ రద్దు..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన రద్దైంది. బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లల్లో కేసీఆర్ పర్యటనకు మందుగా షెడ్యూల్ ఖరారైంది. అయితే అది అనూహ్యంగా రదైంది. వరంగల్ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన ద్రుష్ట్యా అధికారులు ఏర్పట్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ పర్యటన సందర్భంగా దగ్గరుండీ పనులను సమీక్షించారు. కాగా ప్రస్తుతం ఈ పర్యటన రద్దు అయింది. జిల్లా ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పలు అభివృద్ధిపనులకు శ్రీకారం చుట్టాలని సీఎం భావించారు.

 తిరిగి ఎప్పుడు పర్యటన ఉంటుందనే వివరాలను సీఎం కార్యాలయం వెల్లడించలేదు. కాగా ఇప్పటికే వరంగల్ లో ఈనెల 29న నిర్వహించాల్సిన టీఆర్ఎస్ విజయగర్జన సభకూడా వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడదల కావడంతో ఈ రెండు కార్యక్రమాలు రద్దు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఎన్నికల కోడ్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 500 మందికి మించి ఎక్కడా సభలు పెట్టరాదని నిబంధనలు విధించారు.