బీజేపీపై కేసీఆర్ ‘అసెంబ్లీ’ అస్త్రం..!

-

తమని అన్నీ రకాలుగా ఇబ్బందులు పెడుతున్న కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎలాగైనా నిలువరించాలని చెప్పి సీఎం కేసీఆర్ గట్టిగానే కష్టపడుతున్నారు. ఓ వైపు కేంద్రం నుంచి అనేక అడ్డంకులు వస్తున్నాయి..అలాగే రాజకీయ పరమైన ఇబ్బందులు వస్తున్నాయి. ఐటీ, ఈడీ దాడులు పెరిగాయి..ఆర్ధిక పరమైన మద్ధతు లేదు..అప్పుల్లో కోతలు విధిస్తున్నారు. ఇలా రకరకాలుగా బీజేపీ నుంచి కేసీఆర్‌కు రిస్క్ పెరుగుతుంది.

వీటిని ఎదురుకునేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు..ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అంటూ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇటు రాష్ట్రంలో సైతం బీజేపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కానీ బీజేపీ కూడా ధీటుగా కేసీఆర్‌కు చెక్ పెట్టేలా రాజకీయం నడుపుతుంది. దీంతో కేసీఆర్ మరింత దూకుడుగా రాజకీయం చేయాలని చూస్తున్నారు. ప్రతీవేదికపైనే బీజేపీని ఎండగట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. సభలు, మీడియా సమావేశం, క్యాబినెట్ సమావేశం..ఇలా ప్రతిదానిలోనూ మోదీ సర్కార్‌ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే బీజేపీని విలన్ గా చేసి..మళ్ళీ తెలంగాణ ప్రజల్లో సింపతీ లేపి..మళ్ళీ ఎన్నికల్లో లబ్ది పొందాలనే విధంగా కేసీఆర్ రాజకీయం నడుస్తోంది.

ఇదే క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీజేపీ తీరుని ఎండగట్టాలని చెప్పి ప్లాన్ చేశారు. ఇప్పటికే వర్షాకాల సమావేశాలు కేంద్రం టార్గెట్ గానే సాగాయి. అప్పుడు కాంగ్రెస్ సైతం బీజేపీనే టార్గెట్ చేయడం విశేషం. ఇక ఇప్పుడు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 1 లేదా 2వ వారంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. వారం రోజుల పాటు సమావేశాలకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సమావేశాల్లో ఐటీ, ఈడీ దాడులు, అప్పుల్లో కోతలు, ఆర్ధికంగా ఆదుకోకపోవడం, గవర్నర్ అంశం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..ఇలా రకరకాల అంశాల్లో..అసెంబ్లీ వేదికగా బీజేపీని టార్గెట్ చేయాలని చూస్తున్నారు. ఎలాగో అసెంబ్లీలో ఫుల్ మెజారిటీ టీఆర్ఎస్‌కు ఉంది..ఇంకా గంటలు గంటలు కేసీఆర్ ప్రసంగాలు సాగే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news