లక్ష్మీదేవి కటాక్షం కోసం అందరూ పరితపిస్తారు. సిరులు కురిపించే లక్ష్మీదేవికి అంత శక్తి ఉన్న అమ్మ. ఆ తల్లి కటాక్షం పొందాలంటే కొన్ని నియమాలను పాటిస్తాం. అదే విధంగా ఇప్పుడు నేను తెలిపే విధానం కూడా లక్ష్మిదేవి కరుణ కోసమే. దీనికి మీ ఇంట్లో ఓ రెండు వస్తువులను ఉంచాలని పండితులు చెబుతున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం. డబ్బు కావాలని కోరుకోని వారుంటారా? అప్పులు తీరిపోతేనే కదా మనిషికి మనశ్శాంతి. దీని కోసమే నిత్యం ఎంతో కష్టపడతారు. అయితే ఆ కష్టంతో పాటు అమ్మ లక్ష్మీదేవి కృప కూడా ఉండాలని పండితులు చెబుతారు. ఎన్ని ఉన్నా ఆ అమ్మ దయ లేకపోతే ఎలా? చెప్పాండి.
కొంత మంది మంచి ఉద్యోగస్థులై కూడా వారికి ఎప్పుడూ డబ్బు కొరత ఉంటుంది. ఇది ఓ రకమైన సమస్య, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇంట్లో ఈ రెండు ముఖ్యమైనవి ఉండాలి.
చిన్న కర్పూరం బిళ్లలు లభిస్తాయని మనకు తెలుసు. పూజ చేసినపుడు రెండు లేదా మూడు కర్పూరం బిళ్లలను మనం వెలిగించి దైవానికి హారతినిస్తాం. అయితే కర్పూరం బిళ్లను మీ వ్యాలెట్లో పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. గాలి తగిలితే కరిగిపోతుంది. మళ్లీ వేరే బిళ్లను పెట్టుకోవాలి.
అదేవిధంగా దుకాణాల్లో కొబ్బరి కాయలను విక్రయిస్తారు. అందులో రెండు మూడు రకాలు ఉంటాయి. అయితే లక్ష్మీదేవికి చిన్న కొబ్బరి కాయ అంటే ప్రీతికరం. అటువంటి చిన్న సైజు కొబ్బరికాయలను శ్రీఫలం అంటారు. అవి అమ్మవారికి ఎంతో నచ్చుతాయి. వీటిని నివేదిస్తే కోరిన కోరికలు తీర్చేస్తుందట అమ్మవారు.
దానికీ ఒక్కో ధర చెబుతుంటారు. ఐతే… లక్ష్మీ దేవికి చిన్న కొబ్బరి కాయలంటే ఇష్టం. ఎంత చిన్నగా ఉంటే… అంతగా అమ్మకు అవి నచ్చుతాయట. అలాంటి చిన్న కాయల్ని శ్రీఫలం అంటారు. పూజ గదిలో చిన్న కొబ్బరికాయను ఉంచితే… అమ్మవారికి ఎంతో నచ్చుతుందట. ఆ తర్వాత ఎంతో ఆనందపడుతూ… కోరిన కోరికలు తీర్చుతుందని పండితులు చెబుతున్నారు. అలా ఉంచిన కొబ్బరికాయను పగలగొట్టి కూడా పూజ చెయ్యవచ్చు. లేదా కాయగానే ఉంచవచ్చు. పూజ గదిలో పెట్టినా అమ్మవారికి ఎంతో నచ్చుతుందట.ఇలా అమ్మకు ఇష్ట మైన రెండు వస్తువులను పెట్టుకొని అమ్మవారి కృపకు పాత్రులవుదాం.