జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాస్త అనుకూల పవనాలు వీస్తున్నాయి. అయితే ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో రాహుల్ గాంధీ కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి స్టాలిన్ వంటి నేతలతో ఆయన త్వరలో వరుసగా సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి.
ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తే అది కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రాహుల్ గాంధీ ఇప్పుడు కొంతమంది విషయంలో సానుకూలంగా ఉన్నారని సమాచారం. అయితే ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి యూపీఏ లోకి వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని కూడా తెలుస్తుంది. బిజెపిని ఎదుర్కోవడానికి కేరళలో ఆయన కాస్త కీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉండవచ్చు అని కూడా సమాచారం.
కాంగ్రెస్ పార్టీ కేరళలో కాస్త బలంగానే ఉన్న సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ మళ్ళీ విజయం సాధిస్తే మాత్రం ఆమెను వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. మమత విషయంలో సోనియాగాంధీ చాలా అనుకూలంగా ఉన్నారు.