పేరు తెచ్చిన సినిమానే కీర్తి సురేష్ కి శాపం అయిందా..?

మహానటి సినిమాతో కీర్తి సురేష్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తన నటనతో అందరినీ ఫిదా చేసింది. అంతేకాదు కీర్తి సురేష్ కెరీర్కి టర్నింగ్ పాయింట్ గా మారిపోయింది మహానటి సినిమా. కానీ ఈ సినిమానే సురేష్ కెరియర్ కి శాపంగా మారింది అంటే అవుననే టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో.

మహానటి లోని టెంపో మెయింటెన్ చేయకపోవడంతో ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కీర్తి సురేష్. మహానటి తర్వాత మంచి హిట్ చూడనేలేదు కీర్తి సురేష్. కథలు ఎంపికలో కన్ఫ్యూషన్.. కీర్తి సురేష్ ను వరుస ఫ్లాపులతో ముంచెత్తుతోంది. మహానటి తో జాతీయ అవార్డు అందుకని ఎంతో ఇమేజ్ సంపాదించుకున్న కీర్తి సురేష్ తన ఇమేజ్కు సరిపోయే కథలను సెలెక్ట్ చేసుకోకపోవడంతో చివరికి వరుస ప్లాపులు తో సతమతమౌతున్నది.