టాలీవుడ్లో విషాదం.. మరో ప్రముఖ వ్యక్తి మృతి..!

ఈ 2020 సంవత్సరం చిత్ర పరిశ్రమకు ఒక బ్లాక్ క్లియర్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ 2020 సంవత్సరంలోనే కన్నుమూసి చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. ఎన్నో ఏళ్ల పాటు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పనిచేసిన వారు క్రమక్రమంగా ఇప్పటికి కూడా చిత్ర పరిశ్రమకు దూరం అవుతూనే
ఉన్నారు. ఇక ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ ఎడిటర్ మృతి చెందారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ ఇటీవలే కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్ మహమ్మారి తో పోరాటం చేస్తున్న కోలా భాస్కర్ ఇటీవలే ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా విషమించి చివరికి తుది శ్వాస విడిచారు. ఖుషి సెవెన్ జి బృందావన కాలనీ.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే మంచి సినిమాలకు ఈయన ఎడిటర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కోలా భాస్కర్ మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.