Keerthy Suresh : ఫాలోవర్లకు ఛాలెంజ్ విసిరిన క‌ళావ‌తి

-

సోష‌ల్ మీడియాలో హీరోయిన్స్ ఈ మ‌ధ్య కొత్త ఛాలెంజ్‌లు చేసుకోవ‌డం ఓ ట్రెండ్ గా మారింది. కొద్ది రోజులుగా ఈ ఛాలెంజెస్ నెట్టింట్లో చ‌క్క‌ర్లూ కొడుతున్నాయి. ఇప్ప‌టికే త‌మ‌న్నా, పూజాహెగ్దే, స‌మంత వంటి స్టార్లు త‌న ఫాలోవ‌ర్ల‌కు ఛాలెంజ్ చేసిన విష‌యం విధిత‌మే. త‌మ ఫాలోవ‌ర్లు అదేమాదిరిగా డాన్స్ చేయాల‌ని ఛాలెంజ్ విసురుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సోష‌ల్ మీడియాలో డ్యాన్స్ ఛాలెంజ్ చేసింది.


టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్కారువారి పాట ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ది. ఇటీవ‌ల ఈ చిత్రం నుంచి విడుద‌ల అయిన క‌ళావ‌తి సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో క‌ళావ‌తి హంగామా కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే ఈ పాట‌కు మ‌హేస్ కూతురు సితార అద్భుతంగా డ్యాన్స్ చేసిన విష‌యం తెలిసిందే.తాజాగా పాట‌కు కీర్తి సురేష్ స్టెప్పులేసింది. ఈ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతోంది. కీర్తి స్టెప్పుల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మే 12న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.

 

Read more RELATED
Recommended to you

Latest news