ఢిల్లీలో తీవ్ర రాజ్యాంగ సంక్షోభం నెలకొందని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బిజెపి ఒత్తిడి కారణంగా అధికారులు పని చేయడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడారు. ఢిల్లీ అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండడమే ఈ సమస్యకి కారణమని అన్నారు.
ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని పనిచేయనివ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పష్టంగా పనిచేయడానికి వారు మాత్రం ఇష్ట పడట్లేదని చెప్పారు. నేటి బిల్లుని సరి చేసే వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని కొందరు కావాలని అడ్డుకుంటున్నారని అన్నారు. దీనిమీద బీజేపీ వెంటనే స్పందించాలని చెప్పారు. ఈ పథకం క్లియరెన్స్ కోసం లెఫ్టినేట్ గవర్నర్ వి కే సక్సేనా చొరవ తీసుకోవాలని అన్నారు.