ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. 117 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 91 సీట్లను గెలిచి చరిత్ర సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే ఈ ఫలితాలపై ఆ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. తాను నిజమైన దేశభక్తుడు అని.. త్వరలోనే దేశవ్యాప్తంగా తమ పార్టీని విస్తరింపజేస్తామని వెల్లడించారు అరవింద్ కేజ్రీవాల్. కేజ్రీవాల్ ఒక ఉగ్రవాది అని ప్రచారం చేశారనీ… కానీ ప్రజలు తనకే మద్దతు ప్రకటించారని వెల్లడించారు.
ఈ ఫలితాలతో కేజ్రీవాల్ ఉగ్రవాదులు కాదు అసలైన దేశభక్తుడని ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం కేజ్రీవాల్ వివరించారు. మన విద్యార్థులు వైద్య విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ లో మార్పు వచ్చింది… ఇప్పుడు పంజాబు… త్వరలోనే దేశం మొత్తం మార్పు రాబోతుందని వెల్లడించారు.
మొబైల్ రిపేర్ షాప్ లో పని చేసే చిన్న కార్మికుడు ఇవాళ చన్నీని ఓడించాడు అని ఎద్దేవా చేశారు. ఒక సామాన్య మహిళా కార్యకర్త.. ఇవాళ సిద్ధూ ఓడించిందని.. పంజాబ్ ప్రజలు అద్భుత విజయం అందించారని సీఎం కేజ్రీవాల్ ప్రకటన చేశారు. పంజా ప్రజలకు తాను ఎప్పుడు రుణపడి ఉంటానని భరోసా కల్పించారు.