కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగ నియామక పరీక్ష తేదీల్లో మార్పు

-

దేశంలోని కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. పరీక్షల షెడ్యూల్ ను సవరిస్తున్నట్లు కేవీఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది.

కేవీల్లో నిర్వహిస్తోన్న కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. వివిధ విభాగాల్లో మొత్తంగా 13,404 పోస్టులను భర్తీ చేసేందుకు దశల వారీగా ఈ నెల 7నుంచి ప్రారంభమైన ఈ పరీక్షల షెడ్యూల్‌ను సవరిస్తున్నట్టు కేవీఎస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పరీక్ష తేదీలను సవరించినట్టు పేర్కొంది. సవరించిన తేదీలు, షిఫ్టుల జాబితాను  విడుదల చేసింది. ఇప్పటివరకు అసిస్టెంట్‌ కమిషనర్‌ పేపర్‌ 1; పేపర్‌ 2లతో పాటు ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌, పీఆర్‌టీ మ్యూజిక్‌ పోస్టులకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయి. పూర్తి వివరాలను kvsangathan.nic.inలో తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news