లాట‌రీలో రూ.60 ల‌క్ష‌లు త‌గిలింది.. కానీ అంత‌లోనే..!

828

అనుకోకుండా ఊహించ‌నంత సంప‌ద క‌లిసి వ‌స్తే.. ఎవ‌రికైనా ఎలా అనిపిస్తుంది. ప‌ట్ట‌లేనంత సంతోషంగా ఫీల‌వుతారు. ఇంకొంద‌రు ఆ ఆనందాన్ని భ‌రించ‌లేక ఆందోళ‌న చెందుతారు. అయితే అతను మాత్రం ఆ ఆనందాన్ని ప‌ట్ట‌లేక‌పోయాడు. దీంతో గుండె పోటు వ‌చ్చి మృతి చెందాడు. ఈ విషాద‌క‌ర సంఘ‌ట‌న కేర‌ళ‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే…

kerala man got rs 60 lakhs in lottery but died due to heart attack

కేర‌ళ‌లోని అళ‌ప్పుర జిల్లా మావెలిక‌ర గ్రామానికి చెందిన సి.తంబి స్థానికంగా కిరాణా షాపు నిర్వ‌హిస్తున్నాడు. అత‌ను లాట‌రీ టిక్కెట్ల‌ను విక్ర‌యిస్తుంటాడు. ఈ క్ర‌మంలోనే తాజాగా త‌న వ‌ద్ద ఉన్న స్త్రీ శ‌క్తి లాట‌రీల‌ను కూడా విక్రయించాడు. అయితే 10 టిక్కెట్లు మాత్రం అత‌ని వ‌ద్దే మిగిలిపోయాయి. ఇక వాటిలో ఒక టిక్కెట్టు అత‌నికి అదృష్టాన్ని తెచ్చి పెట్టింది. ఆ టిక్కెట్టుకు ఏకంగా రూ.60 ల‌క్ష‌ల లాట‌రీ త‌గిలింది.

అయితే అంత పెద్ద ఎత్తున ఒకేసారి డ‌బ్బు వ‌స్తుండ‌డంతో తంబి ప‌ట్ట‌రానంత సంతోషానికి లోన‌య్యాడు. వెంట‌నే ఆ డ‌బ్బు తీసుకునేందుకు స‌మీపంలో ఉన్న ఫెడర‌ల్ బ్యాంకుకు వెళ్లి టిక్కెట్ ఇచ్చాడు. కానీ అంత‌లోనే అత‌నికి తీవ్ర‌మైన ఛాతి నొప్పి వ‌చ్చింది. దీంతో అతన్ని కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే అత‌నికి అప్ప‌టికే గుండె పోటు తీవ్రంగా రావ‌డంతో అత‌ను మృతి చెందాడ‌ని వైద్యులు తెలిపారు. దీంతో అత‌ని కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు.