జూన్‌ 4 నుంచి దేశంలో తొలి ప్రైవేట్‌ రైలు చుక్‌ చుక్‌

-

దేశంలోనే తొలి ప్రైవేట్‌ రైలు సర్వీసు త్వరలో పరుగులు పెట్టబోతోంది. జూన్‌ 4వ తేదీ నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఎస్‌ఆర్‌ఎంపీఆర్‌ గ్లోబల్‌ రైల్వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహించనుంది. ఈ రైలు ప్రధాన లక్ష్యం పర్యాటకులను ఆకర్షించడమేనని సదరు సంస్థ తెలిపింది.

భారత్‌ గౌరవ్‌యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్‌ ట్రావెల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్త సహకారంతో ఈ ప్రైవేటు రైలు సర్వీసును నిర్వహించనున్నట్లు గ్లోబల్ రైల్వేస్ వెల్లడించింది. తిరువనంతపురం నుంచి గోవా మార్గంలో త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్‌, కోజికోడ్‌, కన్నూర్‌, కాసర్‌గోడ్‌ సహా పలు స్టేషన్లలో రైలును ఆపనున్నట్లు చెప్పారు. ఇందులో ఏకకాలంలో 750 మంది ప్రయాణం చేయొచ్చని.. 2 స్లీపర్‌క్లాస్‌ కోచ్‌లు, 11 థర్డ్‌క్లాస్‌ ఏసీ కోచ్‌లు, 2 సెకండ్‌క్లాస్‌ ఏసీ కోచ్‌లు ఉన్నాయని తెలిపారు. స్టార్‌ హోటల్‌ వసతి, భోజన సదుపాయంతోపాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించే టూర్‌ ప్యాకేజీలను కూడా అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news