విజయవాడ ఎంపీ కేశినేని నాని కొన్ని అంశాల్లో చంద్రబాబు నాయుడు తీరు విషయంలో అసహనంగానే ఉన్నారు. కొన్ని అంశాల్లో చంద్రబాబు నాయుడు తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే ఆవేదన ఆయనకు ఎక్కువగా ఉంది. పార్టీ విషయంలో తన మాట వినడం లేదు అనే ఆవేదన కూడా ఆయనలో ఎక్కువగా కనబడుతుంది. విజయవాడలో వర్గ విభేదాల విషయంలో చంద్రబాబు నాయుడు తన మాట వినలేదని అందుకే… రచ్చ చేసిన వాళ్లతో రాజీ కోసం ప్రయత్నాలు చేశారని వాళ్లు పార్టీని నాశనం చేశారు అనే ఆవేదన వ్యక్తం చేసారు.
తాజాగా సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల కోసం బుద్ధ వెంకన్న కు కీలక బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయనకు బాధ్యతలు అప్పగించడంతో తెలుగుదేశం పార్టీ విజయవాడ నేతలు షాక్ అయ్యారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు తప్పు చేశారని చాలా మంది నేతలు అంటున్నారు. కేసినేని నాని మాట లెక్కచేయకుండా బుద్ధ వెంకన్నకు పార్టీలో మంచి ప్రాధాన్యత ఇస్తూ కొనసాగించడంపై ఇప్పుడు కేసినేని అసహనంగా ఉన్నారని సమాచారం.
ఇటీవల కొంత మంది తో సమావేశమైన సందర్భంగా తాను పార్టీలో ఉండలేకపోతున్నా అని పార్టీ కోసం ఆర్థికంగా చాలా కష్టపడ్డానని కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా తాను విజయం కోసం కష్టపడి పనిచేశానని… ఆర్థికంగా కూడా నష్టపోయానని అయినా తనకు కొంత మంది నుంచి సహకారం రావడం లేదని పరోక్షంగా చంద్రబాబు నాయుడిపై అసహనం వ్యక్తం చేశారట కేసినేని నాని.