కల్వకుంట్ల కవిత పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై కీలక ఆరోపణలు చేశారు. ఒకప్పుడు సామాన్య అపార్ట్మెంట్లో నివసించిన కల్వకుంట్ల కవితకి నేడు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కెసిఆర్ కూతురు అయినందువల్లే కవితకు తెలంగాణలో ఉనికి ఉందన్నారు. కెసిఆర్ కూతురు అయినప్పటికీ ఎంపీగా ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.

ఓడిపోయిన కవితకి ఎమ్మెల్సీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో దొరికిన కవిత మహిళల పరువే కాకుండా తెలంగాణ పరువు తీసిందని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా సీఎం కేసీఆర్ అధీనంలోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. పోలీసుల భుజాన తుపాకి పెట్టి తనని టార్గెట్ చేస్తున్నారని.. పోలీసులను కీలుబొమ్మలా వాడుకుంటున్నారని అన్నారు. తనకి కుటుంబ పరంగా ఉన్న పనులు చేసుకోవడానికి కూడా పోలీసులు అనుమతించడం లేదని అన్నారు. అందుకే పోలీసు శాఖపై కూడా కేసు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news