BSNL వినియోగదారులకు శుభవార్త

-

బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్తను అందించింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే బిఎస్ఎన్ఎల్ రూపురేఖలు మారిపోనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ. 1.64 లక్షల కోట్ల భారీ ప్రాజెక్టుకు మోడీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. దీంతో సంస్థ రూపురేఖలు మారనున్నట్లు వివరించారు. 4g టెక్నాలజీని 4 – 7 నెలలో 5జికి అప్డేట్ చేయనున్నట్లు వివరించారు.

కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న 1.35 లక్షల టెలికాం టవర్ల ద్వారా ఈ సర్వీసులు అందుబాటులోకి రాగలరని పేర్కొన్నారు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న టెల్కో లకు గట్టి పోటీని ఇవ్వడంతో పాటు మారుమూల ప్రాంతాలలో కూడా టెలికాం సేవలకు బిఎస్ఎన్ఎల్ కీలకంగా మారగలదని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా లో భాగంగా భారత్ లో రూపొందించింది, అభివృద్ధి చేసిన 5జి టెక్నాలజీనే బిఎస్ఎన్ఎల్ అమల్లోకి తీసుకురాబోతుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news